Allu Arjun: టీడీపీ MLAతో అల్లు అర్జున్, స్నేహారెడ్డి డ్యాన్స్.. నెట్టింట వైరలవుతోన్న వీడియో

by Anjali |   ( Updated:2024-07-30 06:44:48.0  )
Allu Arjun: టీడీపీ MLAతో అల్లు అర్జున్, స్నేహారెడ్డి డ్యాన్స్.. నెట్టింట వైరలవుతోన్న వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ ఈయన సతీమణి స్నేహారెడ్డి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు... టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి స్నేహారెడ్డి అండ్ ఐకాన్ స్టార్ స్టెప్పులేయడం సోషల్ మీడియాలో చర్చానీయాశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను అల్లు అర్జున్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మా అన్నకు ఏ పార్టీతో సంబంధం లేదని కొట్టిపారేస్తున్నారు. తన అనుకున్న వారికి మాత్రమే బన్నీ మద్దతు పలుకుతారని అంటున్నారు.

రాజకీయ పార్టీలను కాదు.. ఆయన ఇష్టమైన వాళ్లకు మద్దతు ప్రకటిస్తారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఐకాన్ స్టార్ కు జీసీ అస్మిత్ రెడ్డి దంపతులుతో మంచి ఫ్రెండ్షిప్ ఉందట. వీళ్లంతా టూర్‌కెళ్లి ఎంజాయ్ చేసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేసినట్లు దారుణంగా ట్రోలిగ్ చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిని కలిశాడుగా మళ్లీ ట్రోలింగ్ స్టార్ట్ చేయండంటూ అభిమానులు ఫైర్ అవుతున్నార. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ స్నేహా రెడ్డి.. అస్మిత్ రెడ్డితో కలిసి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed