పెళ్లికి ముందే అల్లు అర్జున్‌కు గర్ల్ ఫ్రెండ్.. ఇన్నాళ్లకు ధైర్యం చేసి పేరును రివీల్ చేసిన బన్నీ (వీడియో)

by sudharani |   ( Updated:2023-09-05 03:43:53.0  )
పెళ్లికి ముందే అల్లు అర్జున్‌కు గర్ల్ ఫ్రెండ్.. ఇన్నాళ్లకు ధైర్యం చేసి పేరును రివీల్ చేసిన బన్నీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్న బన్నీ.. ప్రస్తుతం ‘పుష్ప-2’ తో బిజీగా ఉన్నాడు. అటూ సినిమాలు చేస్తూనే.. మధ్యమధ్యలో ఎంటర్టైన్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా.. ఓ ఫోగ్రామ్‌లో పాల్గొన్న ఈయన తన ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరును రివీల్ చేశాడు.

ఆహాలో ప్రసారం అవుతోన్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2’ ఫైనల్స్‌కు బన్నీ గెస్టుగా వచ్చారు. దానికి సంబంధించిన వీడియోలో అల్లు అర్జున్ ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉంది. ఇక.. ఫోగ్రామ్‌లో సాంగ్స్ పాడుతూ అందరిని అలరిస్తున్నారు సింగర్స్. ఈ క్రమంలోనే శృతి అనే సింగర్ పాట చాలా బాగా పాడింది. దీంతో అక్కడ ఉన్నవారు అంతా ఆమెను ప్రశంసించారు. ఇక ఆమె గురించి బన్నీ మాట్లాడుతూ.. ‘నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా అదే’’ అంటూ సిగ్గుపడుతూ నవ్వాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More... ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన బండ్ల గణేష్

Anasuya Bharadwaj : ఆ వ్యక్తితో తొమ్మిదేళ్లు రిలేషన్‌లో ఉన్న యాంకర్ అనసూయ?

Advertisement

Next Story

Most Viewed