మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. బన్నీపై ఫ్యాన్స్ ఫైర్

by Vinod kumar |   ( Updated:2023-02-13 14:12:16.0  )
మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. బన్నీపై ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, సినిమా: రీసెంట్‌గా వైజాగ్‌లో 'పుష్ప2' షెడ్యూల్ ముగిసినట్టు అల్లు అర్జున్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో అభిమానులు బాధని అర్థం చేసుకున్న హీరోలు ఫ్యాన్స్ మీట్ అంటూ ఒక కార్యక్రమం పెట్టి వాళ్లతో ఫొటోలు దిగి ఆనంద పరుస్తున్నారు. లాస్ట్ టైమ్ హీరో యష్ రెండు గంటలు నిలబడి 500 మంది అభిమానుల ఫొటోలకు ఫోజులిచ్చి మెప్పించాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఇటీవల వైజాగ్‌లో ఒక ఫ్యాన్ మీట్ నిర్వహించారు. కానీ, కొన్ని కారణాల వల్ల చివరి క్షణంలో ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. దీంతో ఒక అభిమాని తీవ్ర మనస్థాపానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు. 'ఇది మొదటిసారి కాదు 2-3 సార్లు ఇలా చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్, ఫ్యాన్స్ మీట్.. ఇలా ప్రతి విషయంలో మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు. మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు' అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed