సౌత్ లో సెన్సేషనల్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

by Anjali |   ( Updated:2024-03-21 05:37:54.0  )
సౌత్ లో సెన్సేషనల్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!
X

దిశ, సినిమా: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు ఏకంగా ఉత్తమ జాతీయ అవార్డును అందుకున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప్-2 వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సినిమాల విషయం పక్కన పెడితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సౌత్ ఇండియాలోనే సంచలన రికార్డు సృష్టించాడు. తాజాగా బన్నీ ఇన్‌స్టాగ్రామ్ లో 25 మిలియన్ల అనుచరులను సొంతం చేసుకున్నాడు. 25 మిలియన్లు ఉన్న మొదటి సౌత్ సినీ నటుడిగా అల్లు అర్జున్ ఆ ఘటన సాధించాడు. తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ-21. 3 మిలియన్లు, పవర్ స్టార్ రామ్ చరణ్-20. 8 మిలియన్లు, దుల్కర్ సల్మాన్ 14. 1, సూపర్ స్టార్ మహేష్ బాబు- 13. 4, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- 11. 7, దళపతి విజయ్- 10. 8 మిలియన్లు సంపాదించుకున్నారు.

Read More..

ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీసులో అల్లు అర్జున్.. పుష్ప2 కోసమేనా?

Advertisement

Next Story

Most Viewed