చీరలో కికెక్కిస్తున్న అల్లు అర్జున్.. పుష్ప2 నుంచి క్రేజీ ఫొటో లీక్!

by Jakkula Samataha |   ( Updated:2024-01-30 08:55:43.0  )
చీరలో కికెక్కిస్తున్న అల్లు అర్జున్.. పుష్ప2 నుంచి క్రేజీ ఫొటో లీక్!
X

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మూవీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.పుష్పమూవీ పాన్ ఇండియా లెవల్లో ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా అవార్డుల పంట పండించింది. ఈ మూవీలో అల్లు అర్జున్ నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు.

ఇక పుష్పపార్ట్ వన్‌కి మించి పోయే రేంజ్‌లో సుకుమార్ పుష్ప2ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా మూవీకి సంబంధించిన అదిరిపోయే క్లిప్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం పుష్ప2 మూవీ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈక్రమంలో బన్నీ చీర కట్టుకున్న ఓ పొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ బ్లూ చీర కట్టుకొని కుర్చీలో కూర్చున్నారు.తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప2 సినిమాలో కొన్ని సీన్స్ ఉండబోతున్నాయట . ఆల్రెడీ ఆ జాతరకు సంబంధించిన సీన్స్ కంప్లీట్ అయిపోయాయి . అయితే ఇప్పుడు మరికొన్ని సీన్స్ ని యాడ్ చేయబోతున్నాడట సుకుమార్.అల్లు అర్జున్ కు చీర కట్టి అచ్చం అమ్మవారి లాగానే రెడీ చేశారు . ఇక ఈ ఫొటో చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా అంటున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.

Advertisement

Next Story