- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allari Naresh చేతులమీదుగా 'అనుకున్నవన్ని జరగవు కొన్ని' టైటిల్ Poster లాంచ్
దిశ,వెబ్ డెస్క్: కరోనా తర్వాత థియేటర్ కి వెళ్లి జనాలు సినిమాలు చూస్తారా అని అనుకున్నారు.. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. పది రోజుల ముందే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. తాజాగా విడుదలైన కొత్త సినిమాలు
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న సినిమా 'అనుకున్నవన్ని జరగవు కొన్ని' .ఈ మూవీకి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను అల్లరి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన 'సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి టీమ్ అందరికీ మంచి పేరు రావాలి.. దర్శకుడిగా సందీప్ బిజీ కావాలి’’ అని తెలిపారు.
హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ ''క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. నరేష్‌గారు క్రైమ్, కామెడీ జానర్ సినిమాలెన్నో చేశారు. ఈ టైటిల్ లాంచ్ చేయడానికి నరేష్ గారే కరెక్ట్ అనిపించింది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. నవంబర్ 3న సినిమాను ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు సందీప్ మాట్లాడుతూ ''దర్శకుడిగా నా మొదటి సినిమా ఇది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాం. ఆరిస్ట్‌లు అంతా ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు. అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. నవంబర్ 3న విడుదల కానున్న మా సినిమాని తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. మా సినిమా పోస్టర్ విడుదల చేసిన నరేష్‌గారికి థ్యాంక్స్’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి : ‘Sunoh’.. అభిమానులను అలరిస్తున్న ‘ది అర్చీస్’ ఫస్ట్ సింగిల్