- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంతా కలిసి నన్ను బ్యాన్ చేశారు.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 68 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ నిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా, ఓ పుస్తక ఆవీష్కరణలో భాగంగా చిరంజీవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘మెకానిక్ అల్లుడు సినిమా షూటింగ్ మధ్యలో నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినా నేను లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది. తిరిగి వచ్చాక అప్పుడు ఉన్న సినిమా మ్యాగజైన్స్ అన్ని తెప్పించుకొని మన గురించి, సినిమా గురించి ఏమైనా న్యూస్ వచ్చిందేమో అని చూస్తే ఒక్క న్యూస్ కూడా లేదు. దీంతో నేను ఆశ్చర్యపోయాను దాని గురించి ఆరా తీస్తే. అమెరికాకు వెళ్లే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారికి, నాకు మధ్య ఓ సీన్ అన్నపూర్ణ స్టూడియోలో షూట్ జరుగుతుంది.
నాగేశ్వరరావు గారు, డైరెక్టర్ ఎవరైనా వస్తే లోపలికి రానివ్వద్దు అని అక్కడి వాళ్లకి చెప్పారు. అదే సమయంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను కలవడానికి వస్తే అక్కడ ఉన్న వాచ్ మెన్ లోపలికి పంపించలేదు. ఆ జర్నలిస్ట్ వచ్చినట్టు చెప్పమని చెప్పినా షూట్ అయ్యేదాకా ఎవరిని పంపించొద్దు అని చెప్పడంతో అతను హర్ట్ అయి వెళ్ళిపోయాడు. దీంతో అతను వేరే జర్నలిస్టులతో కలిసి మాట్లాడి ఇలా నా గురించి, నా సినిమాల గురించి కవర్ చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ వచ్చి నాకు చెప్పాక.. ఎవరో వాచ్ మెన్ చేసిన దానికి నన్ను నెగిటివ్ గా తీసుకొని అందరూ కలిసి బ్యాన్ చేయడం సబబేనా అని అడిగాను. నేను వాళ్ళ మ్యాగజైన్స్ కోసం, ప్రతి మ్యాగజైన్ కి సెపరేట్ గా స్టిల్స్ ఇచ్చి వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. అయినా ఇలా చేయడంతో నాకు బాధ అనిపించింది’’ అంటూ చెప్పుకొచ్చారు.