NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. కీరవాణి సంగీతం అందిస్తున్న సినిమాకు దర్శకుడు ఎవరంటే?

by sudharani |
NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. కీరవాణి సంగీతం అందిస్తున్న సినిమాకు దర్శకుడు ఎవరంటే?
X

దిశ, సినిమా: స్వర్గీయ నందమూరి తారకరామరావు మునిమనవడు, హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ దర్శక, నిర్మాత వైవీఎస్‌ చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ఆయన సతీమణి యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి పనిచేస్తున్న నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేసేందుకు శుక్రవారం వైవీఎస్‌ చౌదరి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణరావ్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందిస్తున్నారు' అని తెలిపారు.

Advertisement

Next Story