ఆ విషయంలో నాకు నిహారికకు ఏం తక్కువ మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-07-06 06:28:41.0  )
ఆ విషయంలో నాకు నిహారికకు ఏం తక్కువ మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇటీవల గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ బడులను దత్తత తీసుకుని ప్రశంసలు అందుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ప్రేక్షకులపై ఫైర్ అయింది. ఆమె మాట్లాడుతూ..

నేను హాలీవుడ్ యాక్టర్‌ని.. ఒకటి కాదు చాలా సినిమాలు చేశాను. వాటిని వదిలేసి టాలీవుడ్‌కి వచ్చాను. హాలీవుడ్‌లోనే ఉండి ఉంటే ఈ పదేళ్లలో నేను ఎక్కడో ఉండేదాన్ని. నాకేం కర్మ పట్టింది ఇక్కడికి వచ్చేశాను అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. పెళ్లై పాప కావాలి అనుకున్న టైంలో.. నాకు ఇక్కడ ఉంటేనే మంచిదనిపించింది. ఇక్కడ ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు. అందుకే హాలీవుడ్ నుంచి వచ్చేశాను. లేదంటే నా పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు పాపకి తొమ్మిదేళ్లు వచ్చేశాయి కాబట్టి నాకు రెక్కలొచ్చాయి. ఆ దేవుడు దయ తలచితే మళ్లీ హాలీవుడ్‌కి వెళ్లొచ్చు. ఆ దేవుడు కమాన్ అంటే నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికే వెళ్లిపోతాను. మన తెలుగు ఆడియన్స్ ఎలాంటి వాళ్లంటే.. వేరే ప్రాంతాలు, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్లని విపరీతంగా ప్రేమిస్తారు. మీ ఊరిలో ఉండే అమ్మాయిని ఒక్క శాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉండేవారు.

మధుశాలిని ఎందుకు సినిమాలు చేయడం లేదు.. బిందు మాధవి ఎందుకు చేయడం లేదు.. శివాని ఎందుకు చేయడం లేదు.. నిహారిక ఎందుకు చేయడం లేదు.. మనకంతా కేరళ, తమిళ, పంజాబీ, ముంబై, మధ్యప్రదేశ్, గుజరాత్ గర్ల్స్ కావాలి. తెలుగు వారు మాత్రం వద్దు. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. అందం విషయంలో నాకు నిహారికకు ఏం తక్కువ. తెలుగు అమ్మాయిలు ప్రజలకు నచ్చడం లేదు. అక్కడే సమస్య వస్తుంది. పోనీ నేనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి తెలుగు వాళ్లకు ఛాన్స్ ఇద్దామా? అంటే.. నాకే సినిమాలు లేవు.. ఇప్పుడు వాళ్లందర్నీ తీసుకొచ్చి నేనేం చేయాలి. నేను జనాలను అడుగుతున్నాను’’ అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More: నిహారిక విడాకులు.. ఆ విషయంలో వరుణ్ తేజకు లావణ్య తల్లి క్రేజీ కండీషన్!

Advertisement

Next Story

Most Viewed