Alia Bhat: అలియా ప్రైవేట్ ఫొటోలు తీసిన గుర్తుతెలియని వ్యక్తులు.. బాలీవుడ్ ఫైర్

by Prasanna |
Alia Bhat: అలియా ప్రైవేట్ ఫొటోలు తీసిన గుర్తుతెలియని వ్యక్తులు.. బాలీవుడ్ ఫైర్
X

దిశ, సినిమా : తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం పై బాలీవుడ్ నటి అలియా భట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తమ ఇంటి పక్కనున్న దాబాపై నుంచి కెమెరాలతో తన ఫొటోలను బంధించినట్లు గుర్తించిన నటి.. ఈ విషయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 'మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా? నా ఇంట్లో నా కుటుంబంతో ప్రశాంతంగా సమయం గడుపుతున్నా. కానీ, ఎవరో నన్ను అబ్బర్వ్ చేస్తున్నట్లు అనిపించింది. బయటకు చూస్తే ఎవరో ఇద్దరు వ్యక్తులు మరో ఇంటిపైనుంచి నన్ను వీడియో తీస్తున్నారు. ఇది సరైనదేనా? ఇతరుల పర్సనల్ విషయాలపై గోప్యత పాటించరా? మరొకరి విషయంలో గీత దాటకూడదని మరిచారా?. మీరు మీ హద్దులు మీరి ప్రవర్తించారు' అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై వెంటనే రియాక్ట్ అయిన జాన్వీ కపూర్.. 'ఇది చాలా దారుణం. అసహ్యమైన చర్య. ఇలాంటి పరిస్థితి నాకు చాలాసార్లు ఎదురైంది. నాకు తెలియకుండా ప్రైవేట్ స్థలాల్లో ఉన్నప్పుడు కూడా ఫొటోలు తీశారు' అని రిప్లయ్ ఇచ్చింది. ఇక 'ఇది నిజంగా సిగ్గుచేటు' అంటూ అనుష్క శర్మ రియాక్ట్ అయింది.

Advertisement

Next Story