డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ‘అలా నిన్ను చేరి’ టైటిల్ సాంగ్ రిలీజ్

by sudharani |   ( Updated:2023-10-06 08:21:48.0  )
డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ‘అలా నిన్ను చేరి’ టైటిల్ సాంగ్ రిలీజ్
X

దిశ, సినిమా : నేటితరం నచ్చే, మెచ్చే కంటెంట్ తీసుకొని ఎన్నో జాగ్రత్తలతో ‘అలా నిన్ను చేరి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఆడియన్స్‌లో ఓ డిఫరెంట్ అనుభూతి కలగాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌ చేస్తుండగా.. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కాగా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. చంద్రబోస్ లిరిక్స్ అందించిన పాటకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా.. ఆహ్లాదకరమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్ విజువల్స్ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నాయి. హీరో హీరోయిన్ దినేష్ తేజ్, పాయల్ రాధాకృష్ణ అద్భుతమైన కెమిస్ట్రీ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్ అయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాటలో సుభాష్‌ ఆనంద్ బాణీలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. మొత్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే ఎంతో వినసొంపుగా, విజువల్ ట్రీట్‌గా ఈ పాట ఆకట్టుకుంటోంది. కాగా అతి త్వరలో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.

Advertisement

Next Story