మేకలు కాస్తున్న స్టార్ హీరో.. వీడియో వైరల్

by Disha Newspaper Desk |
మేకలు కాస్తున్న స్టార్ హీరో.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: రీల్‌లైఫ్‌లో అందర్నీ నవ్వించే అక్షయ్ కుమార్ రియల్‌ లైఫ్‌లోనే చాలా సరదాగా ఉంటాడు. జీవితాన్ని ఎంతో ప్రేమించే ఈ స్టంట్‌మ్యాన్ తను చేసే అల్లరిపనుల్ని, ఆనందక్షణాల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం సెలవు దినం కావడంతో మేకలు, కోళ్లకు ఆహారం అందిస్తూ ఎంజాయ్ చేశారు అక్షయ్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 'చిన్న చిన్న విషయాల్లో గొప్ప ఆనందం ఉంటుంది.

సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుని నుంచి మనం ఇంకేమి ఆశించగలం?! ప్రతి రోజు ఈ అందమైన ప్రకృతి మధ్యలో మనం జీవిస్తున్నందుకు దేవునికి ధన్యవాదాలు' తన మనసులోని భావాలకు అక్షరరూపమిచ్చాడు. అంతేకాదు తాను నటించిన కేసరి సినిమాలోని 'తేరి మిట్టి' పాటను ఈ వీడియోకు జోడించడం విశేషం.

https://www.instagram.com/reel/CZD84QdJo0C/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story