పతనం వైపు అక్కినేని హీరోలు.. అలా చేయకపోతే రిస్క్‌లో పడ్డట్లేనా?

by samatah |   ( Updated:2023-06-28 06:10:52.0  )
పతనం వైపు అక్కినేని హీరోలు.. అలా చేయకపోతే రిస్క్‌లో పడ్డట్లేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కినేని నాగేశ్వర్ ద్వారా ఆ కుంటుంబానికి అంత మంచి పేరు వచ్చింది. తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన అక్కినేని నాగార్జున కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

కానీ నాగార్జున కుమారులు మాత్రం ఇంకా చిత్రపరిశ్రమలో మంచి సక్సెస్ అందుకోలేకపోతున్నారు. తాతా, తండ్రిలా వారి టాలెంట్‌ను ఫ్రూచేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే? అక్కినేని హీరోలకు బ్యాట్ టైం స్టార్ట్ అయ్యింది. రిలీజ్‌కు వీరి నుంచి మంచి పెద్ద సినిమాలు ఏవీ లేవు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వచ్చిన అక్కినే హీరోల సీనిమాలన్ని డిజాస్టర్‌గా మిగిలిపోయాయంటూ ముచ్చటిస్తున్నారు నెటిజన్స్.

అంతే కాకుండా ఇప్పుడు కనుక వీరు సెట్ అయ్యి మంచి సినిమాలు సెలక్ట్ చేసుకొని హిట్ అందుకోకపోతే, వీరిని ఫ్యాన్స్ కూడా మర్చిపోయే అవకాశం ఉంది అంటున్నారు. మరి చూడాలి వీరు ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారో.

Also Read: విడిపోబోతున్న బుల్లితెర జంట.. త్వరలో విడాకులు తీసుకోబోతున్న యాదమ్మరాజు?

రోడ్డు పై జరిగిన గొడవ.. అసలు విషయం చెప్పిన నాగ శౌర్య

Advertisement

Next Story