Nandamuri Taraka Ratna :తారకరత్నకు డెడికేట్ చేసిన అక్కినేని అఖిల్

by GSrikanth |   ( Updated:2023-02-21 05:04:13.0  )
Nandamuri Taraka Ratna :తారకరత్నకు డెడికేట్ చేసిన అక్కినేని అఖిల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాయ్‌పూర్‌ వేదికగా సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగ్గా... 64 పరుగుల తేడాతో తెలుగు వారియర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ విధ్వంసకర బ్యాటింగ్‌ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అఖిల్ తొలి ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లో 91... రెండో ఇన్నింగ్స్‌లో 19 బంతుల్లో 65 పరుగులు చేసి భళా అనిపించాడు. ఈ పోరులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన అఖిల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ గెలుపును తమ పూర్వ టీమ్‌ మేట్ నందమూరి తారకరత్నకు అంకితం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చెప్పాడు. దీంతో విస్తృతంగా ట్వీట్లు, రీట్వీట్లు, కామెంట్లతో అఖిల్‌ను అభిమానులు అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed