నాగార్జున గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన అఖిల్

by Anjali |   ( Updated:2023-08-06 12:57:49.0  )
నాగార్జున గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన అఖిల్
X

దిశ, సినిమా: 60 ఏళ్ళ వయస్సు దాటినా ఇప్పటికీ అంతే యంగ్‌గా వెలిగిపోతున్నాడు కింగ్ నాగార్జున. అలా ఎలా సాధ్యమని కింగ్‌ను అడిగిన ప్రతీసారి ‘ఏమి లేదు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఎప్పటికీ నిత్య యవ్వనంతోనే ఉంటా. నా బ్యూటీ సీక్రెట్ ఇదే’ అని చెప్పుకొచ్చాడు. నిజంగా నాగార్జున చెప్పినట్టుగానే ఇప్పటి వరకు అతను నవ్వుతుండటమే చూసాము కానీ కోపం, టెన్షన్‌లో ఉండటం ఎప్పుడూ చూడలేదు. ఇక పోతే చాలా మంది కోపం వస్తే ఒక్కొక్కరు ఒక్కోలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. అలా నాగార్జున తనకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడో హీరో అఖిల్ చెప్పుకొచ్చాడు. ‘నాన్నకు మూడ్ బాలేకున్నా, కోపంలో ఉన్నా కిచెన్‌లోకి దూరి వంట చేస్తారు. అందరిని అడిగి మరీ ఇష్టమైన వంటకాలు రుచికరంగా చేసి పెడుతుంటారు. ఎప్పుడైనా నేను షూటింగ్ నుంచి వచ్చినప్పుడు నాన్న కిచెన్‌లో ఉంటే ఆయన కోపంలో ఉన్నాడని నాకు అర్థమైపోతుంది’ అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు.

Read More..

అమల ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు సినిమాలకు 6 నెలలు బ్రేక్ ఇచ్చాను: నాగార్జున

Advertisement

Next Story

Most Viewed