హాట్ పర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయిన అఖిల్-తేజస్వి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

by sudharani |   ( Updated:2023-05-19 07:37:36.0  )
హాట్ పర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయిన అఖిల్-తేజస్వి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్
X

దిశ, సినిమా: ప్రస్తుతం బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోస్ బాగా సందడి చేస్తున్నాయి. కామెడీ, రియాలిటీ, డ్యాన్స్ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసుకుంటున్నాయి. ఇక ఇందులో భాగంగా తాజాగా 'బీబీ జోడీ' ప్రోగ్రాం 'స్టార్ మా'లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు శ్రీముఖి యాంకర్‌ కాగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ, సదా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో బిగ్ బాస్ అన్ని సీజన్స్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ పాల్గొని తమ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా వచ్చే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇందులో అఖిల్ అండ్ తేజస్విని చేసిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే వీరిద్దరూ చేసిన పర్ఫామెన్స్‌లో డ్యాన్స్ కంటే ఎక్కువగా రొమాన్స్ కనిపించింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'ఇలాంటి షోస్ ఫ్యామిలీతో కలిసి చూడగలరా. మరీ ఇంత ఓవర్ రొమాన్స్ అవసరం లేదనుకుంటా' అంటూ తిట్టిపోస్తున్నారు.

Advertisement

Next Story