అలాంటి వెధవలను వదలకూడదు.. ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తనపై ఐశ్వర్య

by Hamsa |   ( Updated:2022-09-30 10:04:19.0  )
అలాంటి వెధవలను వదలకూడదు.. ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తనపై ఐశ్వర్య
X

దిశ, సినిమా : అందాల భామ ఐశ్వర్య రాజేష్ ఇటీవల ఓ మహిళకు ఎదురైన చేదు అనుభవం గురించి స్పందించింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరించే బ్యూటీ.. ఆ ఆటో డ్రైవర్‌ చేసిన పని‌పై తనదైన స్టైల్‌లో విరుచుకుపడింది. విషయానికొస్తే.. చెన్నైలో ఏ.సీ.జే ఇండియా కాలేజ్‌లో జర్నలిజం కోర్సు చదువుతున్న 'ఇషితా సింగ్‌' అనే యువతి తన సొంతూరు నుంచి సిటీకి వచ్చింది. ఈ క్రమంలో ఓ హోటల్ దగ్గరకు వెళ్లేందుకు తన స్నేహితురాలితో కలిసి ఆటో ఎక్కింది.

అయితే ఆ ఆటో డ్రైవర్ ఆమె‌తో తప్పుగా ప్రవర్తిస్తూ.. శరీర భాగాలను అసభ్యంగా తాకాడు. దీంతో ఆ అమ్మాయి అతడిపై తీవ్రంగా మండిపడింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా అక్కడినుంచి పారిపోయిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఇష్యూపై రియాక్ట్ అయిన ఐశ్వర్య.. 'అలాంటి వెధవలను వదలకూడదు. వెంటనే కఠినంగా శిక్షించాలి. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు. ఇషితా నువ్వు ధైర్యంగా ఉండు' అంటూ ఆ అమ్మాయికి బాసటగా నిలిచింది.

ఇవి కూడా చదవండి : మహిళపై ముగ్గురు వైద్యులు అత్యాచారం..

Advertisement

Next Story