Aishwarya Rai: 200 కిలోల బంగారం ధరించిన ఐశ్వర్యరాయ్.. ఎన్ని కోట్లు, ఎంతమంది, ఎన్ని ఏళ్లు పట్టిందో తెలిస్తే షాక్?

by Anjali |   ( Updated:2024-08-02 06:03:10.0  )
Aishwarya Rai: 200 కిలోల బంగారం ధరించిన ఐశ్వర్యరాయ్.. ఎన్ని కోట్లు, ఎంతమంది, ఎన్ని ఏళ్లు పట్టిందో తెలిస్తే షాక్?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కథానాయిక ఐశ్వర్యరాయ్ అందం, అభినయం, నటన, డాన్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోనవసరం లేదు. 1994 లో ప్రపంచసుందరిగా ఎంపికైంది కూడా. ఈ విశ్వసుందరి ఎన్నో యాడ్స్‌ల్లోనూ నటించింది. ‘ఇరువర్, జీన్స్, చొఖెర్ బలి, మొహొబ్బతె, ధూమ్2, జోధా అక్బర్, ఎంథిరన్, రోబో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోనే తిరుగులేని కథానాయికగా చెరగని ముద్ర వేసుకుంది. నటనలో.. ముఖ్యంగా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. ఇక 2007 లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే పాప జన్మించింది. ప్రస్తుతం ఐశ్వర్య అండ్ అభిషేక్ బచ్చన్ డివోర్స్ తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదంతా పక్కన పెడితే..

అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జోధా అక్బర్’ చిత్రంలో హృతిక్ రోషన్ సరసన ఐశ్వర్య నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ ఏకంగా 200 కిలోల బంగారాన్ని వేసుకుంది. ఈ గోల్డ్ డిజైన్స్ అన్ని మొఘల్, రాజస్థానీ డిజైన్‌లను తలపించేలా ఉన్నాయి. ఇవి 400 కిలోల బంగారం అండ్ ఇతర విలువైన రాళ్లతో తయారు చేశారు అట. ఈ అభరణాలు తయారు చేయడానికి ఏకంగా 2 సంవత్సరాల సమయం పట్టిందట.ఈ గోల్డ్‌ తయారీకి కొన్ని కోట్లే ఖర్చు అయ్యాయని నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ నగలను రెడీ చేసేందుకు 70 మంది కళాకారులు వర్క్ చేశారు. ఐశ్వర్యరాయ్ ధరించిన 200 కిలోల ఒరిజినల్ గోల్డ్ అభరణాల కోసం 50 మంది భద్రతా బలగాలను ఏర్పాటు చేశారట.

Advertisement

Next Story