Aishwarya Rai: ఒంటరిగా విదేశాలకు వెళ్లిన ఐశ్వర్య రాయ్.. అభిషేక్‌ బచ్చన్‌పై మళ్లీ ట్రోల్స్!

by Javid Pasha |
Aishwarya Rai: ఒంటరిగా విదేశాలకు వెళ్లిన ఐశ్వర్య రాయ్.. అభిషేక్‌ బచ్చన్‌పై మళ్లీ ట్రోల్స్!
X

దిశ, సినిమా : బిగ్ బీ ఫ్యామిలీ‌పై ఎప్పుడూ ఏదో ఒక విషయంలో రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిషేక్ బచ్చన్ లేకుండా కుమార్తెతో కలిసి ఒంటరిగా తిరుగుతోందంటే.. వారిమధ్య విడాకులు కన్ఫామ్ అయ్యాయని కొందరు, ఆల్రెడీ డివోర్స్ తీసుకొని ఉంటారని ఇంకొందరు నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు.

ఇంతకు ముందు కూడా ఐశ్యర్యరాయ్ ఫారెన్ వెళ్లగా.. అభిషేక్ బచ్చన్ ‘గ్రే డివోర్స్’ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. దీంతో ఇద్దరిమధ్య పెద్ద వివాదమే జరిగిందని, విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు కాబట్టే అభిషేక్ అలాంటి పోస్టు పెట్టాడని అభిమానులు భావించారు. సోషల్ మీడియాలోనూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ నెటిజన్లు బాగానే ట్రోల్ చేశారు. కానీ బిగ్ బీ ఫ్యామిలీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోగా.. క్లారిటీ కూడా ఇవ్వలేదు.

అయితే ప్రస్తుతం ముంబై విమానాశ్రయంలో ఐశ్యర్య, ఆరాధ్య మాత్రమే కనిపించడం, అభిషేక్ బచ్చన్ లేకపోవడం, ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ వారు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో నెటిజన్లు ‘తల్లి తన కూతురును ఒంటరిగానే చూసుకుంటోంది. తండ్రి మాత్రం కూతురును, వదిలేసి అతని తల్లి దగ్గర సేద తీరుతున్నట్లున్నాడు. భార్యా పిల్లల్ని మర్చిపోయాడేమో’’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ అయితే ఎలాగూ విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యను మళ్లీ పెళ్లి చేసుకోవాలని సలహా ఇవ్వగా.. మరి కొందరు సపోర్టివ్ ఎమోజీస్‌తో అదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

Video Credits to viralbhayani Insta Id

Advertisement

Next Story

Most Viewed