- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AISHWARYA RAI: రహస్యంగా ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకున్న ఐశ్వర్యరాయ్..? హనీమూన్ కోసం న్యూయార్క్‌కు వెళ్లిందా
దిశ, సినిమా: విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు చిహ్నంగా ఆద్య అనే కూతురు కూడా జన్మించింది. ఇలా అన్యోన్యంగా సంతోషంగా లైఫ్‌ను లీడ్ చేస్తున్న వీరు.. గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకుంటున్నారంటూ కొన్ని పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు.. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబాని- రాధిక మర్చంట్ పెళ్లికి బచ్చన్ ఫ్యామిలీ అందరూ కలిసి వస్తే ఐశ్వర్య మాత్రం తన కూతురుతో కలిసి వేరుగా వచ్చారు. అలాగే రీసెంట్‌గా ముంబై ఎయిర్ పోర్ట్‌లోను తన గారాల పట్టీతో వెళ్తున్న ఫొటోలు మీడియాకు చిక్కాయి. దీంతో వీరు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తలను విని విసిగిపోయిన అభిషేక్ బచ్చన్ దీనిపై స్పందిస్తూ.. ఐశ్వర్య రాయ్ నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు, ఆమెను నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు, మేమిద్దరం మా బంధం గురించి ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అంటూ అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ఈ రూమర్స్ కి కాస్త వరకు బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే.. అప్పట్లో ఐశ్వర్య రాయ్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరేమో. ఆ రోజుల్లో మీడియా వీళ్లిద్దరి గురించి ఎన్నో కథనాలు ప్రసారం చేసేది. అందులో భాగంగా ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, వీళ్లిద్దరు హనీమూన్ కోసం న్యూయార్క్‌కి కూడా వెళ్లారని, సల్మాన్ ఖాన్ కోసం ఆమె తన మతాన్ని కూడా మార్చుకుంటుందని ఇలా ఎన్నో రకాల ప్రచారాలు చేశారు. ఇది అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అవ్వడంతో ఐశ్వర్య రాయ్ వరకు ఈ విషయం వెళ్ళింది. దీంతో వెంటనే స్పందించిన ఐశ్వర్య రాయ్.. ఒక ప్రెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది.
ఆ ప్రెస్ మీట్‌లో ఆమె మట్లాడుతూ.. “ఎవరినో రహస్యంగా పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. నేను పెళ్లి చేసుకుంటే నేరుగా, అందరి ముందే పెళ్లి చేసుకుంటాను. రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం నాకు లేదంటూ" ఆమె చెప్పుకొచ్చింది. అలా అప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.