- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ విలన్ హీరోగా మారితే ఎలా ఉంటుంది.. ‘అహో! విక్రమార్క’పై డైరెక్టర్ కామెంట్స్
దిశ, సినిమా: బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో పవర్ ఫుల్ విలన్‌గా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న దేవ్ గిల్ హీరోగా నటిస్తు్న్న తాజా సినిమా ‘అహో! విక్రమార్క’. దక్షిణ భారత చిత్రాల్లో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న దేవ్ గిల్.. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజమౌళి శిష్యుడు పేట త్రికోటి దర్శకత్వం వహిస్తుండగా.. చిత్ర శుక్లా హీరోయిన్‌గా నటిస్తుంది. వార్డ్ విజర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆర్తి దేవిందర్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీ ఆగస్టు 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రదర్శకుడు త్రికోటి మీడియాతో ముచ్చటించారు.
‘నేను మగధీరకు కో డైరెక్టర్‌గా పని చేసిన టైంలోనే దేవ్ గిల్‌తో పరిచయం ఏర్పడింది. అతనికి నేనే డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించేవాడ్ని. అప్పటి నుంచి మా మధ్య మంచి బంధం ఉంది. హీరోగా ఓ సినిమా చేయాలని దేవ్ గిల్ ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ఆర్ఆర్ఆర్ కోసం పని చేస్తున్న టైంలో దేవ్ గిల్ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఆయనకు విలన్ ఇమేజ్ ఉంది. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తిని హీరోగా తెరపైకి తీసుకు రావాలంటే ఎలాంటి జానర్ చేయాలని చాలా అనుకుని.. చివరకు ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో కథను నడిపిస్తే బాగుంటుందని ఈ కథను అనుకున్నాం. ఈ కథ కమర్షియల్‌గా దేవ్ గిల్‌కు ఎలా సెట్ అవుద్దో అలా మలిచాను. ఓ విలన్ హీరోగా మారితే ఎలా ఉంటుంది అనేది కథ. ఇందులో కాస్త మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయి. నేను చేసిన దిక్కులు చూడకు రామయ్య బాగా ఆడింది. జువ్వా అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు వస్తున్న ఈ మూడో సినిమా ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.