స‌మంత ‘ఖుషి’ త‌ర్వాత నాగ‌చైత‌న్యతోనే.. అనౌన్స్ చేసిన డైరెక్టర్

by Prasanna |   ( Updated:2023-08-16 13:24:33.0  )
స‌మంత ‘ఖుషి’ త‌ర్వాత నాగ‌చైత‌న్యతోనే.. అనౌన్స్ చేసిన డైరెక్టర్
X

దిశ, సినిమా: బ‌ల‌మైన ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో కూడిన మూవీస్ తీయడంలో డైరెక్టర్ శివ‌నిర్మాణ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన ‘ఖుషి’ మూవీతో రాబోతున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీగా ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. కాగా తాజాగా ఈమూవీకి సంబంధించి ‘ఖుషి మ్యూజిక‌ల్ కాన్సెర్ట్’ ఈవెంట్‌ ఘనంగా జ‌రిగింది. ఇందులో నిర్మాత ర‌విశంక‌ర్, శివ‌నిర్వాణ తన తదుపరి సినిమాను నాగ‌చైత‌న్యతో తీస్తున్నారని అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌ చేశాడు. అయితే స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకోక‌ముందు వీరిద్దరి కాంబినేష‌న్‌లో ‘మ‌జిలీ’ సినిమాను చేశారు శివ‌నిర్వాణ‌. ఇప్పుడు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రితో వేరు వేరుగా సినిమాలు చేయ‌బోతున్నాడు. కాగా ‘ఖుషి’ రిలీజ్ త‌ర్వాత చైతు సినిమా ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొద‌లుకానున్నట్లు తెలుస్తోంది.

Read More: Sonam Kapoor : రానాకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనమ్ కపూర్?

Advertisement

Next Story