చేసుకున్న భార్య, పిల్లల్ని ఇంట్లోంచి గెంటేసి.. మరో ఆమెతో సంతోషంగా ఉంటారు.. పవన్ కల్యాణ్‌పై పూనమ్ సెన్సేషనల్ పోస్ట్!

by Hamsa |   ( Updated:2024-07-13 04:49:33.0  )
చేసుకున్న భార్య, పిల్లల్ని ఇంట్లోంచి గెంటేసి.. మరో ఆమెతో సంతోషంగా ఉంటారు.. పవన్ కల్యాణ్‌పై పూనమ్ సెన్సేషనల్ పోస్ట్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె గత కొద్ది కాలంగా త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌లపై ఇండరెక్టుగా పోస్టులు పెడుతూ కౌంటర్లు వేస్తోంది. కొన్నిసార్లు ఎవరిని ఉద్దేశించి పోస్టులు పెడుతుందో చెప్పనప్పటికీ.. అమ్మడు చేసే కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల త్రివిక్రమ్‌పై పూనమ్ పెట్టిన పోస్ట్ ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ అమ్మడు గురూజీ అని చెప్తూ ఇండైరెక్టుగా పవన్ లైఫ్‌కు సంబంధించిన విషయంపై పోస్ట్ పెట్టి నెట్టింట దుమారం రేపింది.

‘‘పెయిడ్ ఎస్కార్ట్ భార్య అవుతుంది. తప్పుడు నిందలు వేసి భార్య, పిల్లలను బయటకు గెంటేస్తారు. వచ్చిన ఆమె భర్త ఎలాంటి పనులు చేసినా వచ్చే భార్య సంతోషంగా అంగీకరిస్తుంది. కట్టుకున్నది మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. ఇదంతా గురూజీ స్క్రిప్ట్.. ఎస్కార్ట్, వచ్చిన ఆమెతో సంతోషంగానే జీవిస్తున్నారు. భారతీయ స్త్రీలు వారి శిక్షణ పొందిన మనస్సు కారణంగా బాధపడుతున్నారు. ముందు నుండి ఆమెకు చిన్నప్పటి నుంచి కొందరు నేర్పిస్తారు. మీరు మీ భర్త ఆనందం కోసం ప్రతిదీ త్యాగం చేయాలి. భర్త ముందు వినయంగా ఉండడం.

కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి మిమ్మల్ని మీరు అగౌరవ పరచుకోవడం సరైనదనే ఆలోచనను కొందరు సృష్టిస్తారు. దీన్ని ఎప్పుడూ చేయవద్దు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ పోస్టులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ అమ్మడు పవన్ పేరు తీసుకు రాకపోయినప్పటికీ గురూజీ అంటూ త్రివిక్రమ్ వల్లే పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్పేసింది. ఇక పూనమ్ పోస్టులు చూసిన కొందరు పవన్ కల్యాణ్ గురించే పెట్టిందని అంటున్నారు.

Advertisement

Next Story