జక్కన్న ‘RRR’ మూవీ తర్వాత .. ఆ రికార్డు సొంతం చేసుకున్న ‘బేబీ’

by sudharani |   ( Updated:2023-07-22 13:15:50.0  )
జక్కన్న ‘RRR’ మూవీ తర్వాత .. ఆ రికార్డు సొంతం చేసుకున్న ‘బేబీ’
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా విడుదలైన ‘బేబి’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు వసూళ్లు అటు ఇటుగా ఉన్న.. మౌత్ టాక్‌తో వారం రోజుల్లో రూ. 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టింది. ఇక పోతే సంక్రాంతి బరిలో దిగిన సినిమాలు మాత్రమే .. వీకెండ్ తర్వాత రూ. 2 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబడతాయి. కానీ సంక్రాంతికి కాకుండా నార్మల్ డేస్‌లో రిలీజైన ‘RRR’ సినిమా వీకెండ్ తర్వాత రూ. 2 కోట్లు వసూల్ చేసి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు మళ్ళీ ‘బేబి’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అవును ఈ చిత్రం విడుదల రోజు నుంచి 7వ రోజు వరకు రెండు కోట్ల రూపాయల షేర్ వసూళ్లకు ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్లు రాబట్టింది. కాగా ఇప్పటివరకు 9 రోజులకుగాను రూ.27 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. రేపటితో రూ.30 కోట్ల మార్కును అందుకోవడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు.

Advertisement

Next Story

Most Viewed