- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ తర్వాత స్టైలిష్ లుక్‌లో పవన్ కళ్యాణ్.. భార్యతో ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షం

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని నెలలుగా కేవలం తెల్ల దుస్తులతో కనిపిస్తున్నారు. అలాగే 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ గత నెల 26న అమ్మవారి వారాహి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష భాగంగా 11 రోజుల పాటు ఆయన కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకున్నారు. వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెట్టినప్పటికీ పట్టుదలతో ఆ దీక్షను పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తాజాగా తన భార్యతో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మెరిసారు. అది కూడా తెలుపు దుస్తులలో కాకుండా బ్లాక్ షర్ట్, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి స్వాగ్‌తో చాలా స్టైలిష్‌గా లుక్‌లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జరగబోయే ‘జలజీవన్’ సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
(video link credits to team_pkyf instagram id)