Sobhita Dhulipala : నాగచైతన్యతో ఎఫైర్.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన శోభిత..!

by sudharani |   ( Updated:2023-09-19 16:13:19.0  )
Sobhita Dhulipala
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గూఢచారి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ శోభిత ధూళిపాళ్ల. టాలీవుడ్‌తో సహ ఇతర బాషల్లో కూడా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని హీరో నాగచైతన్యతో శోభిత ఎఫైర్ పెట్టుకుందని పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వీటిపై చైతు, శోభిత ఎన్ని సార్లు స్పందించినప్పటికీ నెట్టింట చర్చలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే చైతుతో ఉన్న రిలేషన్‌పై మరోసారి స్పందించింది బ్యూటీ.

శోభిత మాట్లాడుతూ.. ‘‘సగం జ్ఞానంతో రాసే వారి వార్తలను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే అందులో నిజం లేనప్పుడు నేను ఎందుకు స్పందించాలి. వైరల్ అవుతున్న న్యూస్‌లో ఎలాంటి నిజం లేనప్పుడు, నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ఇలాంటి పిచ్చి వార్తలు నేను అస్సలు లెక్క చేయను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Sobhita Dhulipala Instagram Profile

Advertisement

Next Story