మాకు అదే ముఖ్యం.. సిద్ధార్థ్‏తో డేటింగ్‌పై స్పందించిన అదితి

by sudharani |   ( Updated:2023-03-23 08:19:24.0  )
మాకు అదే ముఖ్యం.. సిద్ధార్థ్‏తో డేటింగ్‌పై స్పందించిన అదితి
X

దిశ, సినిమా : స్టార్ హీరో సిద్ధార్థ్‏తో రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలపై అదితి రావు హైదరీ ఎట్టకేలకు స్పందించింది. తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న నటిని ప్రేమ వ్యవహారం గురించి విలేఖర్లు పలు ప్రశ్నలడిగారు. దీంతో ఓపికగా సమాధానం చెప్పిన అదితి.. తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకుంటానని తెలిపింది.

అలాగే ప్రేక్షకులు ఎవరూ తనను ఇలాంటి ప్రశ్నలడగలేదన్న నటి.. ‘అందరితో చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే.. తప్పుకుండా చెబుతాను. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి డేటింగ్ విషయాలపై ఉండొచ్చు. కానీ, చాలా మందికి మమ్మల్ని స్క్రీన్‌పై చూడటమే ఇష్టం. అందుకు తగ్గట్లుగానే మేము కష్టపడి పనిచేస్తాం. మీరు మా పనిని ప్రేమించాలి. అలా చేసినప్పుడే అభిమానులకు మంచి కంటెంట్ అందించగలం. మాకు అదే ముఖ్యం’ అంటూ క్లారిటీ ఇవ్వకుండా ముగించింది.

Read More: ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతున్న మహానటి.. వీడియో వైరల్

Advertisement

Next Story