రెండు రోజుల్లో ‘ఆదిపురుష్’ రిలీజ్.. అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్

by sudharani |   ( Updated:2023-06-13 15:47:02.0  )
రెండు రోజుల్లో ‘ఆదిపురుష్’ రిలీజ్.. అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా సినిమా ‘ఆదిపురుష్’. ఏం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని జూన్-16న థియేటర్‌లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీకి దాదాపుగా రూ. 500 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు నిర్మాతలు టికెట్స్ రేట్స్ పెంపు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సమావేశాలు జరిపారు. ఇక ఏపీలో టికెట్స్ రేట్స్ పెంపునకు అనుమతులు లభించగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా రేట్లు పెంచుతున్నట్లు జీవోను విడుదల చేసింది. అయితే ఈ న్యూస్ ‘ఆదిపురుష్’ నిర్మాతలకు గుడ్ న్యూస్ అయినప్పటికీ.. ప్రభాస్ అభిమానులకు మాత్రం భారీ షాక్ అని చెప్పుకోవచ్చు.



Advertisement

Next Story