చేతులు జోడించి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన ‘Adipurush’ రైటర్.. ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-07-08 07:18:15.0  )
చేతులు జోడించి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన ‘Adipurush’ రైటర్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. దీనిని డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రామాయణాన్ని కించపరిచారని వివాదాలను ఎదుర్కొంది. హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. ఎన్ని వివాదాలు వచ్చినా వాటిపై మూవీ టీమ్ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

తాజాగా, ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతా షిర్ శుక్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. రెండు చేతులు జోడించి అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజ్‌రంగ్ బలి మనల్నందరినీ ఐక్యంగా ఉంచి, దేశానికి సేవ చేయడం కోసం మనకు శక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు. సినిమా రిలీజ్ అయిన 22 రోజుల తర్వాత రైటర్ ఇలా ట్వీట్ చేయడంతో అది చూసిన వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed