‘ఆదిపురుష్’.. 10 వేల టికెట్లు కొని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయనున్న స్టార్ సింగర్..

by sudharani |   ( Updated:2023-06-12 09:13:19.0  )
‘ఆదిపురుష్’.. 10 వేల టికెట్లు కొని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయనున్న స్టార్ సింగర్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు ఇప్పటికే 10 వేల టికెట్లు ఫ్రీగా ఇస్తామని మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 10 వేల టికెట్లు ఫ్రీగా అభిమానులకు చేరనున్నాయి. ఎలా అంటే..

ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా.. బాలీవుడ్ సింగర్‌గా మంచి గుర్తుంపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఓ స్పెషల్ ఎనౌన్స్ మెంట్ ప్రకటించింది. ‘ఆదిపురుష్’ సినిమాకు 10 వేల టికెట్లు బుక్ చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఆ టికెట్లను పలు పిల్లల సేవా సంస్థలకు, అనాధాశ్రమాలకు డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. టికెట్లు ఫ్రీగా ఇస్తున్న అనన్య బిర్లాను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also Read: ప్రతి రామాలయానికి ఉచితంగా 'ఆదిపురుష్' టికెట్లు

‘Adipurush’ ‌హనుమంతుని సీటు పక్కన సీటు ధర ఎంతో తెలుసా?

టాంజానియా వాసి నోట.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ పాట వీడియో షేర్ చేసిన మూవీ టీమ్

Advertisement

Next Story

Most Viewed