దాని కోసమే బార్‌లో గంటలు గంటలు గడిపేదాన్ని.. అదాశర్మ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
దాని కోసమే బార్‌లో గంటలు గంటలు గడిపేదాన్ని.. అదాశర్మ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆదా శర్మ ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకి అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. కానీ, ఇటీవల వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా.. అదే తరహాలో వచ్చిన ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ’ మూవీతో కూడా మంచి హిట్ అందుకుంది. ఇక తాజాగా ‘సన్ ఫ్లవర్’ వెబ్ సిరీస్‌తో అలరించి. ఇందులో ఓ బార్ డ్యాన్సర్ క్యారెక్టక్‌లో సందడి చేసిన ఈ అమ్మడు.. ఈ క్యారెక్టర్ నేచురల్‌గా వచ్చేందుకు తాను పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదా శర్మ మాట్లాడుతూ.. ‘బార్ డ్యాన్సర్ క్యారెక్టర్ నేచురల్‌గా వచ్చేందుకు.. బార్‌కి వెళ్లి మరి అక్కడ క్షుణ్ణంగా పరిశీలించేదాన్ని. నటనలో సహజత్వం కోసం అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు బార్‌లో గంటలు గంటలు గడిపేదాన్ని. కస్టమర్లతో మాట్లాడడం మిగిలిన అన్ని విషయాలు ప్రత్యేక్షంగా తెలుసుకున్నాకే నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. సిరీస్‌ చూసే ప్రేక్షకుల‌ కళ్లకు వాస్తవంగా అనిపించాలని, ఎంత పర్‌ఫామెన్స్ ఇచ్చిన న‌ట‌న‌లో సహజత్వం కనిపించకపోతే ప్రేక్షకులను ఆకట్టుకోలేము. అందుకే నేచురాలిటీ కోసం రోజూ రాత్రి 9 గంటలకు వెళ్లి ఉదయం 4, 5 గంటల వరకూ బార్‌లోనే గ‌డిపేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదాశర్మ కామెంట్స్నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed