The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ బెంగాల్ వివాదం.. అభిమానిని క్షమాపణలు కోరిన ఆదా

by sudharani |   ( Updated:2023-06-08 14:47:10.0  )
The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ బెంగాల్ వివాదం.. అభిమానిని క్షమాపణలు కోరిన ఆదా
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ఆదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదలపై బెంగాల్ రాష్ట్రం విధించిన నిషేధాన్ని ఉద్దేశిస్తూ ఓ అభిమాని ఆవేదనగా ట్వీట్ చేశాడు. అదికాస్త వైరల్ కావడంతో స్పందించిన నటి.. అతడికి క్షమాపణలు చెప్పింది. ‘నాకు రూ.500 పెట్టి ఈ సినిమా చూడాలని ఉంది.

కోల్‌కతాలో ఎక్కడా షో వేయడం లేదు. ఓటీటీ మాత్రమే మాకున్న ఏకైక ఆధారం’ అంటూ బాధపడిపోయాడు. దీంతో తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన ఆదా.. ‘నన్ను క్షమించండి. ఈ చిత్రంపై గవర్నమెంట్ నిషేధం ఎత్తివేసినా ప్రదర్శనకు సంబంధించిన విషయం మా చేతుల్లో లేదు. మాకూ బాధగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Dia Mirza: నా ప్రియుడు నన్ను మోసం చేశాడు.. నాతోనే కాదు నా బెస్ట్ ఫ్రెండ్‌తోనూ అదే పని చేశాడు: నటి దియా మీర్జా

Advertisement

Next Story

Most Viewed