The Kerala Story వివాదం.. కమల్ కామెంట్స్‌పై స్పందించిన ఆదా

by samatah |   ( Updated:2023-07-14 06:55:04.0  )
The Kerala Story  వివాదం.. కమల్ కామెంట్స్‌పై స్పందించిన ఆదా
X

దిశ, సినిమా: ‘ది కేరళ స్టోరీ’ని విమర్శించిన వారిని ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఆదా శర్మ. దేశ వ్యాప్తంగా ఎన్నో చర్చలకు దారాతీసిన ఈ మూవీపై కమల్ హాసన్ కూడా తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించాడు. అయితే తాజాగా కమల్ వ్యాఖ్యలపై మాట్లాడిన ఆదా.. ‘నిజానికి చాలామంది ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూడకుండానే కామెంట్స్ చేశారు. అలాంటి వాళ్ల విమర్శలకు నేను బాధపడలేదు. మన దేశంలో ఉన్న వాక్ స్వేచ్ఛకు సంతోషిస్తున్నా. ఇక్కడ ఎవరు ఎవరి, దేనిగురించి అయినా ఓపెన్‌గా మాట్లాడవచ్చు. భారత దేశంలో భిన్నాభిప్రాయాలు, అభిరుచులు ఉన్నవాళ్లు ఉన్నారు. ఇది భారతీయులు గర్వంగా చెప్పుకునే గొప్ప విషయం. నేను నా దేశాన్ని అమితంగా ప్రేమిస్తున్నా’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆదా వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More: గ్రామాల్లో నైట్ స్కూల్స్.. స్టార్ హీరో దళపతి విజయ్ కీలక నిర్ణయం..!

Advertisement

Next Story