ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురించి ముందుకు వెళ్లాలి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-09-06 16:01:50.0  )
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురించి ముందుకు వెళ్లాలి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘హార్ట్ ఎటాక్’తో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన అదా శర్మ.. త్వరలో ‘ది గేమ్ ఆఫ్ గిర్గిత్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదా.. కా స్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నిజానికి నా సినీ ప్రయాణం స్టార్టింగ్‌లో నేను కూడా ఎన్నో ఒడుదొడుకులు ఎదర్కొన్న. కానీ ఎలాంటి పరిస్థితులు మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు అందులో యాక్షన్ సీన్స్‌లో నటించేటప్పుడు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తామో.. నిజ జీవితంలో కూడా అలాగే ఉండాలి. మనతో ఎవరైనా తప్పుగా బిహేవ్ చేయ్యాలని చూసినప్పుడు కూడా అంతే వేగంగా కనిపెట్టి.. ఆ టైంలో మనం ఏం చేయాలనేదానిపైనే దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పక్కవారి అభిప్రాయాలను తీసుకోకూడదు. పక్కవారి అభిప్రాయాలను తీసుకోకూడదు. ఏ రంగంలోనైనా సపోర్ట్ నెట్‌వర్క్ కలిగి ఉండాలి. అలా నాకు మద్దతు ఇచ్చేవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story