ఫుల్‌గా తాగి ఊగుతూ కనిపించిన నటి.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

by Jakkula Samataha |
ఫుల్‌గా తాగి ఊగుతూ కనిపించిన నటి.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా : ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ ఎప్పుడు ఏ డ్రెస్ ధరిస్తుందో కూడా ఎవరూ ఊహించలేరు. చిత్ర విచిత్ర దుస్తులు ధరించడంలో ఈమెను మించినవారు ఎవరూ లేరు అంటారు ఈ నటి అభిమానులు. అంతే కాకుండా, హాట్ హాట్ పోజులతో..బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్‌తో విమర్శలు అందుకోవడంలో కూడా ఈమె ముందుంటుంది.

ఇక తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడు ఫుల్‌గా తాగి, ఊగుతూ మీడియా కంట పడింది. దీంతో ఈమెపై తన ఫ్యాన్స్ తెగ ఫైర్ అవుతున్నారు. తాజాగా ఉర్ఫీ ఫుల్‌గా తాగి మద్యం మత్తులో ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఫోటోస్ చేస్తున్న క్రమంలో ఓ ఫోటో గ్రాఫర్ తనను కాసేపు ఆగమని అడగ్గా.. ఉర్ఫీ మాట్లాడుతూ.. నేను చాలా తాగాను, నన్ను ఆపకండి,వెళ్లనివ్వండి అని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇది చూసిన కొందరు అంత నడవలేకుండా ఉండేంతగా తాగడం ఎందుకు? కాస్త తక్కువ తాగొచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. తన అభిమానులు మాత్రం తాగినప్పుడు ఫోటోలకు ఫోజులివ్వకుంటే ఏమౌతుందని చెప్పుకొస్తున్నారు.

Next Story

Most Viewed