Akshay Kumar వల్ల డిప్రెషన్‌కు గురయ్యా.. స్టార్ నటి ఎమోషనల్ కామెంట్స్ Viral

by Hamsa |   ( Updated:2023-08-21 15:53:59.0  )
Akshay Kumar వల్ల డిప్రెషన్‌కు గురయ్యా.. స్టార్ నటి ఎమోషనల్ కామెంట్స్ Viral
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటి భానుప్రియ చెల్లి శాంతి ప్రియకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శాంతి ప్రియ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ ఇక్కే పె ఇక్కా సినిమా కోసం మేమంతా ఒక మిల్లులో షూటింగ్ చేస్తున్నాం. నాది గ్లామర్ రోల్ కావడం వల్ల పొట్టి దుస్తులు ధరించాను. పాత్ర డిమాండ్ మేరకు మోకాలు పైన ఉండే దుస్తుల్ని వేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అక్షయ్ నన్ను చూసి ఏమైంది? మోకాలికి దెబ్బ తగిలిందా? అంత నల్లగా ఉందేంటి? అని కామెంట్ చేశాడు. దాంతో సెట్‌లోని వారందరూ నన్ను చూసి నవ్వారు. నాకప్పుడు 22-23 ఏళ్లు ఉంటాయి. అక్షయ్ చేసిన బాడీ షేమింగ్ వల్ల నేను డిప్రెషన్‌కు గురయ్యాను. ఆ సమయంలో అమ్మ మాత్రమే నాకు అండగా నిలబడింది ’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శాంతి ప్రియ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసి పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇవి కూడా చదవండి :

స్టార్ హీరో Allu Arjun మామకు CM KCR బిగ్ షాక్..!

బాత్రూమ్‌లోనే ఆ పని చేసిన స్టార్ కపుల్.. లవర్‌కు జిప్ వేసిన ప్రియుడు

వాడికి అన్ని కోట్లు అవసరమా అంటూ ఆ డైరెక్టర్ మీద మండిపడుతున్న నెటిజెన్స్?

Advertisement

Next Story