23 ఏళ్లకే అన్ని అనుభవించాను పెళ్లికాకముందే తల్లినయ్యా.. ఇప్పటికి చేయాలనుంది: స్టార్ నటి

by Anjali |
23 ఏళ్లకే అన్ని అనుభవించాను పెళ్లికాకముందే తల్లినయ్యా.. ఇప్పటికి చేయాలనుంది: స్టార్ నటి
X

దిశ, సినిమా: ఒకప్పుడు బోల్డ్ పాత్రల్లో నటించి.. టాలీవుడ్ లో శృంగార తారగా ముద్ర వేసుకుంది నటి షకీలా. అడల్ట్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీని ఏలిందని చెప్పుకోవచ్చు. స్టార్ డమ్ తగ్గాక పలు సినిమాల్లో కామెడీ రోల్స్ లో మెరిసింది. ఇక గత ఏడాది నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. అనూహ్యంగా 2 వ వారంలోనే ఎలిమినేట్ అయింది. ఇకపోతే తాజాగా షకీలా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది.

‘‘బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే నేను నమ్మలేదు. ఫేక్ అనుకున్నాను. హౌస్ లో రెండు, మూడు వారాల కంటే ఎక్కువగా ఉండాలనుకోలేదు. అనుకున్నట్లుగానే వెళ్లిపోయాను. ఎలిమినేట్ అయినందుకు నాకేం బాధలేదు. నేను మొత్తం 400 మూవీల్లో నటించాను. అందులో 40 చిత్రాలు తెలుగులో నటించినవి. నా మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు స్టార్ హీరోలు సైతం తమ సినిమాలు వాయిదా వేసుకునేవారు. ప్రతి శుక్రవారం నా మూవీ రిలీజ్ అయ్యేది. నేను అడల్ట్ చిత్రాలు చేసింది ముఖ్యంగా నా కుటుంబం కోసమే. నా ఫ్యామిలీ ఎవరూ నాతో లేరు. మనీ ఉంటేనే ఎవరైనా మనతో ఉంటారు.

ప్రస్తుతం నాకు తిండికి బట్టలకు ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నా కుటుంబమే నాతో లేదు. 23 ఏళ్ల ఏజ్ లోనే అన్ని చూశాను. స్టార్ డమ్ అనుభవించాను. అప్పుడే 5 కార్లు కొనుగోలు చేశాను. ఒక ఇళ్లు కొన్నాను. అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాను. ట్రాన్స్ జెండర్స్ ను దత్తత తీసుకున్నాను. వారికి మ్యారేజ్ కూడా చేస్తున్నాను. టాలీవుడ్ లో ఇంకా మూవీల్లో నటించాలని ఉంది. నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం’’ అంటూ షకీలా చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed