ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో జబర్దస్త్‌కు రోజా?

by Jakkula Samataha |
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో జబర్దస్త్‌కు రోజా?
X

దిశ, సినిమా : నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ప్రేమ తపస్సు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఈ నటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలన్నింటిలో కలిపి 100కు పైగా సినిమాల్లో నటించింది.

తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి, నగరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి, రెండు సార్లు విజయం సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఆమె( వైసీపీ ) వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రోజా ఎమ్మెల్యేగా గెలవడానికి ముందే 2013లో జబర్దస్త్ ప్రారంభం కాగా, అప్పటి నుంచి ఆ షోకు జడ్జిగా వ్యవహరించారు. నాగబాబుతో కలిసి ఆమె జబర్దస్త్ కామెడీ షోకు జడ్జీగా వ్యవహరించడంతో, ఆమె వేసే పంచ్ డైలాగ్స్, నాగబాబుతో జోడీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో షో మరింత ఉత్సాహంగా కొనసాగేది. కానీ రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జబర్దస్త్‌కు దూరమైంది. తర్వాత చాలా మంది కమెడీయన్స్, యాంకర్ కూడా మారడం జరిగింది. ఇక ఇదంతా పక్కన పెడితే,2024 లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడిన విషయం తెలిసిందే.

ఈ సారి ఎన్నికల ఫలితాల్లో నగరి రోజా దారుణంగా ఓడిపోయారు. దీంతో ఈమె త్వరలో జబర్దస్త్ షోకి జడ్జిగా రాబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె ఎన్నికల్లో పరాజయం పొందిన నేపథ్యంలో మరలా బుల్లితెరపై సందడి చేయనుంది, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటున్నారు కొందరు. అయితే ఇది చూసిన వారు రోజా జబర్దస్త్‌కు రావడమే నిజమైతే నిజంగా, ఆ కామెడీ షోకు మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.

Advertisement

Next Story

Most Viewed