కాల్ సెంటర్‌లో చేరిన నటి.. పని దొరకపోవడంతో..

by Hajipasha |   ( Updated:2022-09-21 11:58:51.0  )
కాల్ సెంటర్‌లో చేరిన నటి.. పని దొరకపోవడంతో..
X

దిశ, సినిమా: టెలివిజన్ యాక్ట్రెస్ ఏక్తా శర్మ కాల్ సెంటర్‌లో జాయిన్ అయింది. 'డ్యాడీ సంఝా కరో', 'ఖుసుమ్', 'క్యుంకీ సాస్ భీ కబీ బహు థీ', 'కామిని-దామిని' లాంటి పలు పాపులర్‌ సీరియల్స్‌లో నటించిన ఆమె.. పాండమిక్ కారణంగా జీవితం పూర్తిగా తలకిందులైందని తెలిపింది. తన దగ్గర ఉన్న కాంటాక్ట్స్‌తో వర్క్ కోసం సంప్రదించినా.. సీరియళ్లలో ఒక్క క్యారెక్టర్ లభించలేదని వివరించింది. తర్వాత తన దగ్గరున్న ఆభరణాలు అమ్మేసి ఏడాదిపాటు ఎలాగో జీవించామని.. కానీ తన కూతురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లి జాబ్ చేయడమే బెటర్ అని డిసైడ్ అయినట్లు చెప్పింది. గ్రాడ్యుయేట్ అయిన తను ఏడుస్తూ కూర్చునే కన్నా ముందుకు సాగడమే సరైన నిర్ణయం అంటున్న ఏక్తా శర్మ.. తను చేస్తున్న పని గురించి సిగ్గుపడట్లేదని, పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నానని తెలిపింది.

Also Read: సమంతపై రూమర్స్‌కు చెక్ పెట్టిన మేనేజర్

Advertisement

Next Story