- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బైక్ స్టంట్ చేస్తూ 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన నటుడు.. బతికి బయటకు వస్తాను అనుకోలేదు అంటూ నరేష్ ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పలు చిత్రాల్లో హీరోగా, కమెడియన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తండ్రి పాత్రలు కూడా చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విజయ నిర్మల కొడుకు గా ఇండస్ట్రీకి పరిచయం అయి ఎన్నో సినిమాలు చేశారు.
అయితే, ఇటీవల మదర్స్ డే సందర్భంగా ఆయన ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా తన ఇంట్లో ఉన్న వస్తువులు, ఫోటోలను, తన బైక్ ఫొటోల కలెక్షన్స్ చూపించారు. తన ఫొటోల కలెక్షన్ చూపించి నరేష్ ఒక ఫోటో చూపిస్తూ తన యాక్సిడెంట్ గురించి చెప్పారు. మోటార్ సైకిల్ జంప్ చేశానని యాక్సిడెంట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. "ఇది నా ఫస్ట్ మోటార్ సైకిల్ జంప్ అమ్మ ‘ప్రేమ సంకెళ్లు’ సినిమాకి చేయించింది. మొదట్లో చెన్నైలో చేశాను బాగానే వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లో చేశాను. ఇందులో భాగంగా నేను 20 ఫీట్ గాల్లో ఎగరగానే అక్కడి నుంచి బండితో పాటు పడిపోయాను.
కుడి వైపు మొత్తం దెబ్బలు తగిలి మూడు నెలలు హాస్పిటల్ లో ఉన్నాను. బతికి బయటకు వస్తాను అని అనుకోలేదు. ఇక అదే నాకు లాస్ట్ బైక్ జంప్. అందరూ తిట్టారు. కానీ, నేనేం పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు నరేష్.