- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Bigg Boss’కు వెళ్తే విడాకులే అంటూ.. నటుడికి వార్నింగ్ ఇచ్చిన భార్య
దిశ, వెబ్‌డెస్క్: నటుడు రవి శివతేజ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహ 'ఉస్తాద్' సినిమాలో రవి శివతేజ నటించాడు. అందులో హీరోకు బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపించాడు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివతేజ బిగ్‌బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఉస్తాద్ కథ బాగున్నా జైలర్, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలతో విడుదల కావడం వల్ల మాకు అంత స్పేస్ దొరకలేదు. అయితే సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడేవాడిని. కష్ట సమయంలో నా భార్య శ్యామల నాకు తోడుగా నిలిచింది. మా మధ్య ప్రేమ మొదలై నాటికి డైరెక్టర్ విజయ్ భాస్కర్ కూతురని తెలియదు. కొద్ది రోజుల తర్వాత అసలు విషయం తెలిసాక పెళ్లి జరుగుతుందా లేదా అనే భయం పట్టుకుంది. కానీ, మా పెళ్లి కావడానికి కారణం శ్యామలనే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి కుటుంబ సభ్యులను ఒప్పించింది. నా జీవితంలోకి ఆమె రావడం ఎంతో అదృష్టమని తెలిపాడు. ఇక బిగ్‌బాస్ రియాలిటీ షోపై స్పందిస్తూ.. బిగ్‌బాస్‌లోకి వెళ్తే నాకు విడాకులు ఇచ్చేస్తానని ఆమె వార్నింగ్ ఇచ్చింది. నాకు కూడా ఆ షోకు వెళ్లాలనే ఆలోచన లేదని తెలిపాడు’’. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : బిగ్‌హౌస్‌లోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. హీటెక్కనున్న షో..!