రజినీకాంత్ 100% కరెక్ట్.. ఆయన మాటలు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి : జగపతి బాబు

by Nagaya |   ( Updated:2023-05-04 14:53:05.0  )
రజినీకాంత్ 100% కరెక్ట్.. ఆయన మాటలు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి : జగపతి బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సినీనటుడు జగపతి బాబు తన మద్దతు ప్రకటించారు. వైసీపీ రజినీకాంత్‌ను టార్గెట్ చేయడంపై జగపతిబాబు స్పందించారు. రజనీకాంత్ 100 శాతం రైట్ అని చెప్పుకొచ్చారు. రజినీకాంత్ మాట్లాడే విధానం..ఆయన అనే మాటలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి అని చెప్పుకొచ్చారు. చక్కగా మాట్లాడతాడు.. నిజాయితీగా మాట్లాడతాడు.. నిజాలు మాట్లాడతాడు అని ప్రశంసించారు. మాట్లాడేవాళ్లు మాట్లాడుకొంటూనే ఉంటారు. అవేం ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు అని సినీనటుడు జగపతి బాబు స్పష్టం చేశారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకులకు ముఖ్య అతిథిగా హాజరైన రజినీకాంత్ ఎన్టీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఆకాశానికెత్తేసేలా కీలక వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ సోషల్ మీడియా రజినీకాంత్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రజినీకాంత్ వైసీపీ ప్రభుత్వంపై కానీ, సీఎం జగన్‌ను కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదని అలాంటి వ్యక్తిపై వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోవడంపై సూపర్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్సెస్ రజినీ అభిమానులుగా మారిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

సుధాకర్ చాలా మంచి వ్యక్తి.. మళ్లీ గెలిపించండి: బ్రహ్మానందం

Advertisement

Next Story