Prabhas: ప్రభాస్ జోకర్‌లా ఉంటాడంటూ నటుడు కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుధీర్ బాబు (పోస్ట్)

by Hamsa |
Prabhas: ప్రభాస్ జోకర్‌లా ఉంటాడంటూ నటుడు కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుధీర్ బాబు (పోస్ట్)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకంటూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నాడు. అయితే డార్లింగ్ ఇటీవల నటించిన కల్కి రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అలాగే భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. ప్రజెంట్ ఆయన నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలో.. ప్రభాస్‌పై నటుడు అర్షద్ వార్సీ సంచలన కామెంట్స్ చేశాడు. కల్కిలో ఆయన లుక్ జోకర్‌లా అనిపించింది. మెల్ గిబ్బన్స్ గంభీరంగా కనిపించాల్సిన ఆయన మరోలా ఉన్నాడు. మ్యాడ్ మ్యాక్స్ చూడాలనుకుంటున్నా కానీ కల్కిలో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ నాకు అస్సలు అర్థం కావడం లేదు’’ అని అన్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, అర్షద్ కామెంట్స్‌పై సుధీర్ బాబు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యాడు. ‘‘ చేసే విమర్శలు హుందాగా ఉంటే తప్పు లేదు. కానీ అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం మంచిది కాదు. అర్షద్ వార్సీ ఇలాంటి కామెంట్లు చేస్తారని నేను ఊహించలేదు. చిన్న మనసుల నుంచి వచ్చే వ్యాఖ్యలకు ప్రభాస్ స్థాయి తగ్గదు అది చాలా పెద్దది’’ అని రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు గూబ గుయ్యిమనేలా చేశాడని కామెంట్లు పెడుతున్నారు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నువ్వు సూపర్ అన్నా పాన్ ఇండియా స్టార్ మీద అలా చేసిన వారికి బాగా బుద్ధి చెప్పావని అంటున్నారు.

Advertisement

Next Story