మహేష్ బాబును భోజనం పెట్టమని సిగ్గులేకుండా అడిగాను.. స్టార్ నటుడు సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |
మహేష్ బాబును భోజనం పెట్టమని సిగ్గులేకుండా అడిగాను.. స్టార్ నటుడు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మురారి రీరిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసికల్ మూవీ రేపు (ఆగస్టు9)మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు విడుదల చేస్తున్నారు. కాగా సూపర్ స్టార్ అభిమానులంతా మురారి సినిమా వీక్షించడం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. కాగా ఈ క్రమంలో మురారి మూవీలో నటించిన నటులు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

మురారి సినిమాలో అద్భుతంగా నటించిన నటుడు చిన్నా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటన ఆయన్ను బాగా ఎమోషనల్ చేసింది. ఈ మూవీ 50 రోజులు అవుట్ డోర్ రామచంద్రపురంలో షూటింగ్ జరిగిందని తెలిపారు. ప్రొడక్షన్ ఫుడ్ పడకపోవడంతో చిన్నాకు ఎప్పుడైనా సరే ఇంటి నుంచే ఫుడ్ వచ్చేదని వెల్లడించారు. కానీ అవుట్ డోర్ ఉండటంతో ఇంటిదగ్గర నుంచి ఫుడ్ తెప్పించుకోవడం కష్టమైందన్నారు.

రామచంద్రపురంలో మహేష్ బాబు సిస్టర్ ఉంటుందని, ఆయనకు అక్కడ నుంచే భోజనం వస్తుందని పేర్కొన్నారు. దీంతో ఒకరోజు బయట ఫుడ్ తినలేనని సిగ్గు లేకుండా సూపర్ స్టార్ ను ఫుడ్ పెట్టమని అడిగానన్నారు. వెంటనే మహేష్ బాబు దానికేముందండి వచ్చి తినండని అన్నారని ఇంటర్వ్యూలో చిన్నా చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. 50 రోజుల పాటు మహేష్ చెల్లెలు తీసుకొచ్చిన ఫుడ్డే తిన్నామని, ఆయన వాళ్లని చాలా బాగా చూసుకున్నారని తెలిపారు.

Advertisement

Next Story