- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Director Souryuv : ఎన్టీఆర్‌తో యాక్షన్ సినిమా.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
దిశ, సినిమా: డైరెక్టర్ శౌర్యువ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘హాయ్ నాన్న’ చిత్రంతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ యాక్షన్ మూవీ చెయ్యబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. శౌర్యువ్ సినిమా కథ ఎన్టీఆర్‌కు చెప్పగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని న్యూస్ వైరల్ అయింది. అంతే కాకుండా.. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు.. పార్ట్ 1 2026లో, పార్ట్ 2 20287లో విడుదల చేసేలా ప్లాన్ చేశారని కూడా టాక్ వినిపించింది.
అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్ట్ శౌర్యువ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దురదృష్టవశాత్తు అది తప్పుడు సమాచారం. ఈ రూమర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయో నాకు తెలియదు కానీ.. అందులో నిజం లేదు. కానీ ఏదో రోజు ఇవి నిజం అవ్వాలని కోరుకుంటున్న. ఎన్టీఆర్‌తో ఏదో ఒకరోజు సినిమా తీయాలని కోరుకుంటున్న’ అంటూ చెప్పుకొచ్చాడు.