దానికంటే తెలుగు తమిళ చిత్రాల్లో నటించడం బెటర్ : షాహిద్ కపూర్

by Anjali |   ( Updated:2023-06-05 12:48:22.0  )
దానికంటే తెలుగు తమిళ చిత్రాల్లో నటించడం బెటర్ : షాహిద్ కపూర్
X

దిశ, సినిమా: ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాలు నంబర్ వన్ స్థాయిలో ఉన్నాయి. దీంతో ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తాజాగా ‘బ్లడీ డాడీ’ మూవీలో జూన్ 9న ప్రేక్షకుల ముందుకురానున్నాడు. కాగా ప్రమోషన్‌లో భాగంగా షాహిద్ ఓ ఇంటర్వూలో పాల్గొన్నాడు. మీకు హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వస్తే నటిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘హాలీవుడ్ సినిమా అవకాశాలు వస్తే నటించను. ఎందుకంటె హాలీవుడ్ సినిమాల్లో మనకు ప్రాధాన్యత లేని పాత్రల్లో అవకాశాలు ఇస్తారు. అది అవసరం లేదు. దాని కంటే సౌత్ ఇండస్ట్రీలో తెలుగు లేదా తమిళ భాషల్లో నటించటం బెటర్. ఇందులో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తా’ అని చెప్పాడు.

Also Read: తమిళ సినిమాల మీదే ఆసక్తి చూపిస్తున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

‘టక్కర్’ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది: దర్శకుడు కార్తీక్

Advertisement

Next Story