- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పుష్ప 2’ గురించి మాట్లాడుతూ… ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న రష్మిక
దిశ, సినిమా: ‘యానిమల్’ సినిమాతో సెన్సెషన్ హిట్ ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘పుష్ప 2’, ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పుష్ప 2’ సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ ఫస్ట్ పార్ట్ కంటే ‘పుష్ప 2’ చాలా పెద్దదిగా ఉంటుందని మీకు ప్రామీస్ చేస్తున్నాను. మొదటి సినిమాతో మీకు ఎంటర్టైన్మెంట్ అందించాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ పై ప్రజలు చాలా అంచనాలు పెట్టుకున్నారు. దీంతో మా పై మరింత బాధ్యత పెరిగింది. అందుకే మేము ఈ అంచనాలను అందించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడే ‘పుష్ప 2’ కోసం ఓ సాంగ్ షూట్ పూర్తిచేశాను. అది ఎంతో అద్భుతంగా వచ్చింది. ఇది ఒక ముగింపు లేని కథ.. దీనిని గేమ్ గా గానీ.. పలు విధాలుగా ఎంజాయ్ చేస్తూ ఆనందించవచ్చు. మీకు మంచి సినిమా అందించాలనే తపనతో డైరెక్టర్ సుకుమార్ చాలా కష్టపడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.