ఆమె జీవితంలో క్షమించలేని తప్పు చేసిందంటూ అభిషేక్ బచ్చన్ సంచలన కామెంట్స్.. విడాకుల గురించేనా?

by Kavitha |   ( Updated:2024-08-07 05:32:26.0  )
ఆమె జీవితంలో క్షమించలేని తప్పు చేసిందంటూ అభిషేక్ బచ్చన్ సంచలన కామెంట్స్.. విడాకుల గురించేనా?
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోనే లవ్‌లీ కపూల్స్ అనే పేరు తెచ్చుకున్న వీరు.. గత కొంత కాలంగా విడాకులు తీసుకుంటున్నారంటూ ఓ పుకారు షికారు కొడుతుంది. అయితే వీరిద్దరూ కూడా దీనిపై స్పందించకపోవడంతో ఇంకా అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. కరీనా కపూర్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “ఓ రోజు సినిమా షూటింగ్‌లో భాగంగా రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నాము. అయితే ఆ సీన్ మధ్యలో కరీనా కపూర్ నువ్వు నాకు బ్రదర్ లాంటి వాడవని.. నీతో నేను రొమాన్స్ ఎలా చేయాలి?.. ప్రేమలో పడినట్లు ఎలా యాక్టింగ్ చేయాలి అని అనేసింది. ఆమె ఒక్కసారిగా అలా అనేయడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఇంకా కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించేటప్పుడు కూడా నాకు ఆమె మాటలే గుర్తొచ్చి ఆమెతో మంచిగా రొమాంటిక్ సీన్లు పండించలేక పోయాను. అది నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆమె అలా చెప్పి జీవితంలో క్షమించలేని తప్పు చేసింది అంటూ అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా అభిషేక్ బచ్చన్ వారసుడిగా 2000లో ‘రెఫ్యూజీ’ అనే మూవీ ద్వారా బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అభిషేక్ బచ్చన్. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా దర్శకత్వం వహించగా.. కరీనా కపూర్ కూడా ఈ మూవీతోనే హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed