- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. క్లారిటీ!
దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ బిగ్ బీ అమిత్ బచ్చన్ కుమారుడు, యువ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఎస్పీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో పార్టీలో చేరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లోక్‌సభ స్థానం నుంచి అభిషేక్ బచ్చన్ బరిలో దిగే ఛాన్స్ ఉన్నట్లు చర్చలు సైతం జరుగుతున్నాయి. తాజాగా, ఈ వార్తలపై సమాజ్‌వాది పార్టీ స్పందించింది.
అభిషేక్ బచ్చన్ తమ పార్టీలో చేరతాడంటూ జరుగుతున్న ప్రచారం అంతా పుకారేనని ఖండించింది. ఈ విషయంపై అభిషేక్ ఇప్పటి వరకు స్పందించలేదు. అభిషేక్ 2013లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు రాజకీయాల్లోనే ఉన్నారని, నేను రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో ప్రయాగ్‌రాజ్ ఎంపీగా కాంగ్రెస్ తరపున భారీ మెజారిటీతో తండ్రి అమితాబ్ బచ్చన్ గెలిచారు. ఎస్పీ రాజ్యసభ ఎంపీగా ప్రస్తుతం తల్లి జయాబచ్చన్ కొనసాగుతున్నారు.
Also Read: Mangalagiri: దర్శకుడు Ram Gopal Varmaపై పోలీసులకు ఫిర్యాదు..