Tarakతో పనిచేయడమంటే నాకు చాలా ఇష్టం.. ఎగ్జయిట్‌గా ఉంటుంది

by samatah |   ( Updated:2023-08-10 05:34:00.0  )
Tarakతో పనిచేయడమంటే నాకు చాలా ఇష్టం.. ఎగ్జయిట్‌గా ఉంటుంది
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ జూనీయర్ ఎన్టీఆర్‌తో మరోసారి పనిచేసే అవకాశం దక్కడం ఆనందంతోపాటు చాలా ఎగ్జాయిటింగ్‌గా ఉందంటున్నాడు బీహారీ యాక్టర్‌ అభిమన్యు సింగ్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’లో కీ రోల్‌ పోషిస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన.. తారక్‌తో తన అనుభవాలను పంచుకున్నాడు. ‘మేమిద్దరం కలిసి పని చేయడం ఇది రెండోసారి. ‘జై లవకుశ’తర్వాత మళ్లీ ఆయనతో కలిసి స్రీన్ షేర్ చేసుకుంటున్న. ఇది గొప్ప అనుభవం. తారక్‌తో పనిచేయడమంటే చాలా ఇష్టం. మా కలయికలో రాబోతున్న ‘దేవర’ అందరినీ మెప్పించడమే కాదు బిగ్ హిట్ అవుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. ఇక ‘జనతా గారేజ్‌’ తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండగా అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలకానుంది.

Also Read: Pawan Kalyan ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘OG’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడే!

Advertisement

Next Story